Thursday 28 April 2011

సోనియా మాస్ లేడీ!!!!

నిన్న ఒక తెలుగు న్యూస్ ఛానెల్ వార్తలలో  ఒక వార్త విశేషంగా ఆకర్షించింది.  శ్రీమతి సోనియా గాంధీ గారు సెక్యూరిటీని పక్కన పెట్టి రోడ్ మీద నడుచుకుంటూ వెళుతున్నారు.  ఆమె అలా ఎందుకు వెళుతున్నారు? ఎక్కడికి వెళుతున్నారు?  
 
ఏమిటా అని ఆసక్తిగా చూసా.  ఆమె (సోనియా) తన ఇంటి నుంచి ఆఫీసుకి నడుచుకుంటూ వెడుతుంది.  దానికి ఆ ఛానల్ పది నిముషాల సేపు పెద్ద బిల్డప్ ఇచ్చింది.  చూపిందే చూపి, చూపిందే చూపి ప్రాణం  తీసారు.  ఆమె ప్రజలకు మమేకం అవుదామని ప్రయత్నిస్తున్నదని, సెక్యూరిటీని చేధించుకొని మరీ ప్రజలలో కలిసిపోతుందని, రోడ్ మీద ట్రాఫ్ఫిక్ని కుడా లక్ష పెట్టటం లేదని.
 
అలాగే పాకిస్తాన్ ఇండియా ల మధ్య జరిగిన మాచ్లో ప్రజల మధ్యలో కూర్చుని చూసారని వరల్డ్ కప్ ఇండియా గెలిచాక డిల్లీలో ప్రజలతో మూడు గంటలు గడిపేరని  ఒకటేమిటి కావలసిన్నన్ని భాష్యాలు చెప్పింది ఆ ఛానల్.  
 
రాజకీయ నాయకులు అందరు చేసే పనే అది. ప్రజలే వారి ఓటు బ్యాంకు.  ఇందులో విచిత్రం ఏముంది.     
 
ఏమిటిబ్బా ఇంతకు ముందు ఇలా సోనియాని పొగిడిన  దాఖలాలు లేవే ఏమిటి ఈ విచిత్రం అని రవ్వంత ఆశ్చర్యం వేసింది.
 
ఆలోచిస్తే అర్థమైంది.  ఓహో ఇది కడపలో జరిగే ఎన్నికలలో ఒక భాగం అని.  ఇలా చూపించి ప్రజలని ప్రభావితం చెయ్యొచ్చు అనుకోవటం. 
 
శత్రువుకి శత్రువు మిత్రుడైనట్టు ఎలాగైనా జగన్ని ఓడించాలి అని కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది.   
 
వేచి చూడాలి  ఈ తరహ వార్తలవల్ల కడప ప్రజలు ఎంత ప్రభావితులవుతరో!!!!!   
 
 
లేకపోతే ఉన్నట్టుండి  సోనియాని మాస్ లేడీగా, ప్రజలలో మమేకమవుతున్న లీడర్ గా  చూపించటానికి కారణం ఏమి ఉంటుంది ?.
    

1 comment: