Friday 26 August 2011

పండిట్ జవహర్లాల్ నెహ్రు గారు నిజామాబాద్ లో చేసిన ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల విలీన ప్రకటన


ప్రెస్ అకాడెమి అఫ్ ఆంద్ర ప్రదేశ్ వారు ఒక అద్బుతమైన పని చేసారు.  వారి వెబ్సైటు లో దాదాపు పదిలక్షల పేజీల గల పాత న్యూస్  పేపర్లని, వార మాస పత్రికలని స్కాన్ చేసి ఉంచారు.  ఆసక్తి కొద్ది నిజామాబాద్ లో నెహ్రు గారు  చేసిన ఆంద్ర తెలంగాణా ప్రాంతాల విలీనం గురించి చేసిన ప్రసంగం విశాలాంద్ర పేపర్ (7 -3 -1956) లో దొరికింది.  ఆ లింక్ కింద ఇస్తున్నాను.  

Friday 5 August 2011

గాన సరస్వతి "వాణి జయరాం"





శాస్త్రీయ సంగీతపు దన్నుతో, గళలాలిత్యంతో 

పలు భారతీయ భాషలలో అద్బుతగానంతో సినీసంగీత ప్రియులను 

నాలుగు దశాబ్దాలుగా ఉర్రుతలూగిస్తున్న గాన సరస్వతి!

"బోలోరే పపీహర" అంటూ 'గుడ్డి' సినిమాతో హిందీసీమలో అడుగుపెట్టి లత, ఆశాలకే 

దడ పుట్టించిన దక్షిణాది గాయని శిరోమణి!

మాతృభాష కాకపోయినా స్వచమైన ఉచ్చారణతో తెలుగు శ్రోతల హృదయాలను దోచిన శారదా స్వరూపిణి

'శంకరాభరణం' 'స్వాతికిరణం'  తెలుగు సినిమాలలో పాడిన పాటలకు రెండుసార్లు జాతీయగాయని పురస్కారం అందుకొని 'జయ' కేతనాన్ని ఎగరవేసిన మహిళామణి  
                 
                                                  "వాణి జయరాం" 

దూరదర్సన్ సప్తగిరి చానెల్ క్రితం శనివారం రాత్రి 8 గం. ల కు ప్రసారమైన ఆమె కార్యక్రమం అధ్బుతంగా   ఉంది.

గుడ్డి, శంకరాభరణం  లో ఆమె పాడిన పాటల తో కూర్చిన  కార్యక్రమం మొదటి భాగం సమయం తెలియకుండా గడిచి పోయింది.  
   
ఆమె బాల్యం గురించి, సినిమాలలో ప్రవేశం గురించి వాణి జయరాం ఇచ్చిన వివరాలు సరికొత్తగా ఉన్నాయి.

ఇంకా మూడు భాగాలు ప్రసారమవుతాయి.


దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి రా 8 గం. లకు తిరిగి సోమవారం ఉదయం
8 .30 ని. లకు

"పూజలుసేయ పూలు తెచ్చాను" అని పాడిన వాణి జయరాం గురించి శ్రోతలకు దూరదర్సన్ వారు ఏ గీతా కుసుమాలు  తెస్తారో, ఆమె జీవన సౌరభాలను ఎలా పంచుతారో మిగిలిన భాగాలలో చూద్దాం.