Thursday 28 April 2011

సోనియా మాస్ లేడీ!!!!

నిన్న ఒక తెలుగు న్యూస్ ఛానెల్ వార్తలలో  ఒక వార్త విశేషంగా ఆకర్షించింది.  శ్రీమతి సోనియా గాంధీ గారు సెక్యూరిటీని పక్కన పెట్టి రోడ్ మీద నడుచుకుంటూ వెళుతున్నారు.  ఆమె అలా ఎందుకు వెళుతున్నారు? ఎక్కడికి వెళుతున్నారు?  
 
ఏమిటా అని ఆసక్తిగా చూసా.  ఆమె (సోనియా) తన ఇంటి నుంచి ఆఫీసుకి నడుచుకుంటూ వెడుతుంది.  దానికి ఆ ఛానల్ పది నిముషాల సేపు పెద్ద బిల్డప్ ఇచ్చింది.  చూపిందే చూపి, చూపిందే చూపి ప్రాణం  తీసారు.  ఆమె ప్రజలకు మమేకం అవుదామని ప్రయత్నిస్తున్నదని, సెక్యూరిటీని చేధించుకొని మరీ ప్రజలలో కలిసిపోతుందని, రోడ్ మీద ట్రాఫ్ఫిక్ని కుడా లక్ష పెట్టటం లేదని.
 
అలాగే పాకిస్తాన్ ఇండియా ల మధ్య జరిగిన మాచ్లో ప్రజల మధ్యలో కూర్చుని చూసారని వరల్డ్ కప్ ఇండియా గెలిచాక డిల్లీలో ప్రజలతో మూడు గంటలు గడిపేరని  ఒకటేమిటి కావలసిన్నన్ని భాష్యాలు చెప్పింది ఆ ఛానల్.  
 
రాజకీయ నాయకులు అందరు చేసే పనే అది. ప్రజలే వారి ఓటు బ్యాంకు.  ఇందులో విచిత్రం ఏముంది.     
 
ఏమిటిబ్బా ఇంతకు ముందు ఇలా సోనియాని పొగిడిన  దాఖలాలు లేవే ఏమిటి ఈ విచిత్రం అని రవ్వంత ఆశ్చర్యం వేసింది.
 
ఆలోచిస్తే అర్థమైంది.  ఓహో ఇది కడపలో జరిగే ఎన్నికలలో ఒక భాగం అని.  ఇలా చూపించి ప్రజలని ప్రభావితం చెయ్యొచ్చు అనుకోవటం. 
 
శత్రువుకి శత్రువు మిత్రుడైనట్టు ఎలాగైనా జగన్ని ఓడించాలి అని కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది.   
 
వేచి చూడాలి  ఈ తరహ వార్తలవల్ల కడప ప్రజలు ఎంత ప్రభావితులవుతరో!!!!!   
 
 
లేకపోతే ఉన్నట్టుండి  సోనియాని మాస్ లేడీగా, ప్రజలలో మమేకమవుతున్న లీడర్ గా  చూపించటానికి కారణం ఏమి ఉంటుంది ?.
    

Wednesday 20 April 2011

సత్యసాయిబాబాగారి గురించి

శ్రీ సత్యసాయిబాబాగారి గురించి శ్రీ MBS ప్రసాదు గారు చక్కని విశ్లేషణాత్మకమైన వ్యాసం రాసారు.  ఈ లింకుని చూడండి http://telugu.greatandhra.com/mbs/april2011/satya_part1.php

Tuesday 19 April 2011

పాకుతా మెల్లగా మెల్లగా !!!!!!

E TV లో ప్రముఖ సినీ గాయకుడు శ్రీ శ్రీపతి  పండితరాధ్యుల   బాల సుబ్రహమణ్యం గారి ఆధ్వర్యంలో నిర్వహించపడుతున్న"పాడుతా తీయ్యగా" కార్యక్రమం ఫైనల్స్ అంకం జీళ్ళపాకంలా మెల్లగా సాగుతుంది. 
 
ఆ చిన్నపిల్లలని ఎందుకు అంత క్షోభ పెడుతున్నారో అర్థం కావడం లేదు.  4 వారాలుగా ఫైనల్స్ సాగుతూనే వుంది ...
 
చాలామందికి వీక్షకులకి విజేత ఎవరో  ఈ పాటికే తెలిసినట్టుగా ఉంది శ్రీ బాలుగారి హావభావాల వల్ల.
 
సాగతీతగా  ఈ కార్యక్రమం జరగడానికి బహుశా వారు అనుకున్నవిధంగా ఈ కార్యక్రమానికి డబ్బులు వచ్చి ఉండకపోచ్చు లేదా బాగా డబ్బులు వస్తూ ఉండవచ్చు లేదా బహుమతి మొత్తం ఎక్కువగా ఇస్తున్నాము అని బాధ ఉండవొచ్చు.
 
ఒన్స్ మోర్ లు వస్తున్నాయి కదాని పద్యం రాగాలు ఎక్కువ తీసినట్టు...
ద్రౌపది చీరలు ఎక్కువ లాగినట్టు టీవీ సేరియల్స్ తో వేగలేక పోతున్నాం . ఇక ఇవి కూడా చేరితే మనమే వెళ్లి యాడ్స్ ఇచ్చే వాళ్ళను ఇవ్వ వద్దని బతిమాలాలి
 
ఏదిఏమైన ఆ పిల్లలని ఇంకా  బాధించక తాను అనుకున్న వాళ్లకి బహుమతి ఇచ్చి కార్యక్రమం ముగించేస్తే మంచిది బాలుగారు.  will you pl hear me    
     

Monday 18 April 2011

ఖరనామ సంవత్సరం అంటే గాడిదనామ సంవత్సరమా?

శ్రీ ఖరనామ సంవత్సరం అంటే గాడిద నామ  సంవత్సరం అని మొన్న ఉగాది రోజున చాలామంది సెలవఇచ్చారు.
ఒక పేపర్ అయితే  గాడిదలని పెట్టి కార్టూన్ కూడా వేసింది.  ఇంకొక పేపర్ ఆదివారం పుస్తకంలో మనకున్న 60 తెలుగు సంవత్సరాలలో జంతువు పేరుమీద వచ్చేది ఇది ఒక్క సంవత్సరమే అనేసింది.  కొంతమంది పండితులు కూడా టీవీ చానల్స్ లో ఇదే విధంగా చెప్పారని వినికిడి.
 
అసలు ఖర నామ సంవత్సరం అంటే అర్ధం ఇదేనా!  
 
నాకు తెలిసినంతవరకు కాదు ... అయినా ఎందుకైనా మంచిదని "శబ్ద రత్నాకరం" చూసాను.  అందులో అర్ధం ఏముందంటే ....
 
                      ఖర అంటే ..... స్త్రీ, ఎండిన పోకచెక్క, వాడిగలది, వేడిగాలది, ఒక తెలుగు సంవత్సరం పేరు అని ఉంది
 
                     ఖరము ....... గాడిద
 
సంస్కృతంలో కూడా ఖర అంటే వాడి, వేడి అని అర్థం ఉంది ఖరః అంటే గాడిద అని ఉంది.
 
మొత్తానికి ఈ ఖర నామ సంవత్సరం జంతువుకి సంబంధించినది కాదు.  వాడిమి,  వేడిమి గల  సంవత్సరంగా  ఉండబోతుంది. 
 
జరుగుతున్న పరిణామాలు కూడా రాబొయ్యే కాలాన్ని సూచిస్తూన్నాయీ అనిపిస్తుంది.  
 

అంతా రామమయమేనా

 శ్రీరామ నవమి సందర్భంగా తెలుగు టీవీ చానల్స్ మంచి కార్యక్రమాలని ప్రసారం చేసాయి.

కార్యక్రమాలలో ఎక్కువగా వినిపించిన పాట "రామదాసు" (నాగార్జున) సినిమాలో 'అంతా రామమయం ఈ జగమంతా రామమయం'. 

తెలుగు సినిమాల్లో శ్రీ రాముని మీద చాలా మంచి పాటలు వచ్చాయి.
భూకైలాస్ లో ' రాముని అవతారం'
శాంతి నివాసం లో 'శ్రీ రఘురాం జయరఘురాం'
ఉయ్యాలా జంపాల లో ' అందాలరాముడు ఇందివరశ్యాముడు'
గోరంతదీపంలో 'రాయినైనా కాకపోతిని'   

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాటలు ఉన్నాయ్.  కాని చానల్స్ ఎక్కువగా రామదాసు సినిమాలో పాటల మీదే ఆధారపడ్డాయి

వీడియొ వేస్తె కాపీ రైట్ సమస్య వస్తుంది అనుకుంటే ఆడియో వేయొచ్చు గదా కార్యక్రమంలో  (క్లిప్పింగ్స్ మీద)