Tuesday 6 September 2011

'బహుముఖ ప్రజ్ఞాశాలి" భానుమతి


"భానుమతి" ఈ పేరు వినగానే తలంపుకు వచ్చేది 'బహుముఖ ప్రజ్ఞాశాలి".  సినీరంగంలో అనేక శాఖలలో విశేష ప్రజ్ఞా పాఠవాలు కలిగిన ఆమె జయంతి  (7 సెప్టెంబర్)  సందర్భంగా సప్తగిరి దూరదర్శన్ హైదరాబాద్ ఛానల్లో ఈ రోజు (6 వ తారికున)  రేపు (7 వ తారికున) రాత్రి 8 గం. ల కు భానుమతి గారితో ఇంతకుముందు  విజయదుర్గ గారు చేసిన ఇంటర్వ్యూని ప్రసారం చేస్తుంది.  ఆమె నటించిన వివిధ చిత్రాలలో సన్నివేశాలు,   పాడిన వైవిధ్యభరితమైన పాటలతో కార్యక్రమం రూపొందించారు.

భానుమతిగారి జయంతి సందర్బంగా ఈ కార్యక్రమం ద్వారా ఆమె  జ్ఞాపకాలని మరోసారి నెమరువేసుకుందాం 


Friday 26 August 2011

పండిట్ జవహర్లాల్ నెహ్రు గారు నిజామాబాద్ లో చేసిన ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల విలీన ప్రకటన


ప్రెస్ అకాడెమి అఫ్ ఆంద్ర ప్రదేశ్ వారు ఒక అద్బుతమైన పని చేసారు.  వారి వెబ్సైటు లో దాదాపు పదిలక్షల పేజీల గల పాత న్యూస్  పేపర్లని, వార మాస పత్రికలని స్కాన్ చేసి ఉంచారు.  ఆసక్తి కొద్ది నిజామాబాద్ లో నెహ్రు గారు  చేసిన ఆంద్ర తెలంగాణా ప్రాంతాల విలీనం గురించి చేసిన ప్రసంగం విశాలాంద్ర పేపర్ (7 -3 -1956) లో దొరికింది.  ఆ లింక్ కింద ఇస్తున్నాను.  

Friday 5 August 2011

గాన సరస్వతి "వాణి జయరాం"





శాస్త్రీయ సంగీతపు దన్నుతో, గళలాలిత్యంతో 

పలు భారతీయ భాషలలో అద్బుతగానంతో సినీసంగీత ప్రియులను 

నాలుగు దశాబ్దాలుగా ఉర్రుతలూగిస్తున్న గాన సరస్వతి!

"బోలోరే పపీహర" అంటూ 'గుడ్డి' సినిమాతో హిందీసీమలో అడుగుపెట్టి లత, ఆశాలకే 

దడ పుట్టించిన దక్షిణాది గాయని శిరోమణి!

మాతృభాష కాకపోయినా స్వచమైన ఉచ్చారణతో తెలుగు శ్రోతల హృదయాలను దోచిన శారదా స్వరూపిణి

'శంకరాభరణం' 'స్వాతికిరణం'  తెలుగు సినిమాలలో పాడిన పాటలకు రెండుసార్లు జాతీయగాయని పురస్కారం అందుకొని 'జయ' కేతనాన్ని ఎగరవేసిన మహిళామణి  
                 
                                                  "వాణి జయరాం" 

దూరదర్సన్ సప్తగిరి చానెల్ క్రితం శనివారం రాత్రి 8 గం. ల కు ప్రసారమైన ఆమె కార్యక్రమం అధ్బుతంగా   ఉంది.

గుడ్డి, శంకరాభరణం  లో ఆమె పాడిన పాటల తో కూర్చిన  కార్యక్రమం మొదటి భాగం సమయం తెలియకుండా గడిచి పోయింది.  
   
ఆమె బాల్యం గురించి, సినిమాలలో ప్రవేశం గురించి వాణి జయరాం ఇచ్చిన వివరాలు సరికొత్తగా ఉన్నాయి.

ఇంకా మూడు భాగాలు ప్రసారమవుతాయి.


దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి రా 8 గం. లకు తిరిగి సోమవారం ఉదయం
8 .30 ని. లకు

"పూజలుసేయ పూలు తెచ్చాను" అని పాడిన వాణి జయరాం గురించి శ్రోతలకు దూరదర్సన్ వారు ఏ గీతా కుసుమాలు  తెస్తారో, ఆమె జీవన సౌరభాలను ఎలా పంచుతారో మిగిలిన భాగాలలో చూద్దాం. 

Monday 11 July 2011

భారత దేశపు నయాగరా


కేరళ రాష్ట్రంలో  అతిపిల్లీ గ్రామం దగ్గరగా ఒక అందమైన జలపాతం ఉంది.  చాలా మందికి ఈ ప్రదేశం గురించి తెలియదు.  నిజం చెప్పాలంటే కేరళలో ఉండే కొంతమందికే తెలుసు అంటే ఆశ్చర్యం వేస్తుంది.  

కోయంబత్తూరు నుంచి కొచ్చిన్ వెళ్ళే దారిలో ఉంది ఈ ప్రదేశం (మాప్ చూడండి).  త్రిచూర్కి రోడ్ ద్వారా 65 కిలో మీటర్ల దూరం లోను కొచ్చిన్ విమానాశ్రయానికి 60  కిలో మీటర్ల దూరం లోను ఉంది. 

వర్షాకాలం వెళ్ళిన తరువాత అంటే సెప్టెంబర్ నెలలో వెళితే మదురానుభూతిని కలుగ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ సమయంలో జలపాత ఉదృతి బావుంటుంది.

మీ కోసం ఆ ప్రదేశానికి సంభందించిన కొన్ని ఫొటోస్ మరియు మాప్ ఇస్తున్నాను.  వచ్చే దసరా సెలవల్లో సరదాగా మన భారతదేశా నయాగరా చూసిరండి.









Thursday 30 June 2011

తెలుగు మా(పా)టకు సినిమా తెగులు - శ్రీ పైడిపాల


మన  సినిమాలలో మన మాత్భ భాష తెలుగు ఎంత దౌర్భాగ్య స్థితికి చేరుకుందో, దాని వల్ల యువతరం ఎలా ప్రభావితం అవుతున్నారో తెలియచేస్తూ శ్రీ పైడిపాల ఈ రోజు ఆంధ్రభూమి 'వెన్నెల' లో ఒక మంచి వ్యాసం రాసారు.  దాని లింక్ ఇస్తున్నాను.  తప్పకుండా చదవండి.


Friday 17 June 2011

హాస్యబ్రహ్మ జంధ్యాల







నటుడిగా, నాటక రచయిత గా, సినీ రచయితగా, దర్శకుడిగా అన్ని రకాల సినిమాలు రాసినా, తీసినా హాస్యానికి చిరునామా గా వాసి కెక్కిన ప్రతిభా వంతుడు జంధ్యాల.  


 భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే ప్రసాదించిన వరం నవ్వు అయితే, పండిత పామర భేదం లేకుండా  తెలుగు ప్రేక్షకులకు మనసార నవ్వే యోగం కల్గించిన ఉత్తముడు  జంధ్యాల. 


 హాస్య సినిమాల యుగం జంద్యాలతో ఊపందుకుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.


భగవంతుడు కేవలం మనుషు లకు మాత్రమే ప్రసాదించిన నవ్వును దేవుళ్ళకూ రుచి చూపించాలని ఇతర లోకాలకి జంధ్యాల పయనించి రేపు జూన్ 19 కి దశాబ్దం గడిచి- పోతుంది. 
 
ఆయన మన  మధ్య ఉండగా ఇచ్చిన ఇంటర్వ్యూ హైదరాబాద్ దూరదర్శన్ వారు మళ్లీ మనకోసం రేపు ఆదివారం జూన్ 19 వ తారికున రాత్రి 8 గం.లకు మళ్లీ తిరిగి సోమవారం 20 వ తేది మద్యాహ్నం 1 . 30 గం లకు ప్రసారం చేస్తున్నారు.  

Thursday 16 June 2011

2022 సం. లో "దోహ కతర్" లో ప్రపంచ కప్ ఫుట్ బాల్ కోసం నిర్మిస్తున్న స్టేడియమ్స్ - ఫొటోస్

2022 సం. లో దోహ కతర్ లో జరగబోయే ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అద్బుతంగా స్టేడియంలని నిర్మిస్తున్నారు. వాళ్ళు నిర్మించే కొన్ని స్టేడియంల నమూనాలు

అక్కడ వాతావరణం వేడిగా ఉంటుందని అన్ని స్టేడియమ్స్ ఏ సి చేయిస్తున్నారు.  ఆయిల్ ఉన్న దేశం కదా ఆర్భాటాలు బాగానే ఉంటాయి. "All the Best" చెపుదాము.