Wednesday 25 May 2011

ప్రపంచంలో కొన్ని దేశాలలో బస్సు స్టాండ్స్


ప్రపంచంలో కొన్ని దేశాలలో బస్సు స్టాండ్స్ ఎలా ఉన్నాయో  ఈ కింద ఫొటోస్ లో చూడవచ్చు.


అతేన్స్ (గ్రీసు)



అట్లాంటా (యు స్ ఎ) 



బెర్లిన్ (జర్మనీ)


బ్రెసిల్ (బ్రెజిల్)



దుబాయి



ఫ్రాంక్ ఫర్ట్ (జర్మనీ)



హాంబర్గ్ (జర్మనీ)



లండన్ (ఇంగ్లాండ్)


మిలాన్ (ఇటలి)



న్యూయార్క్ (యు స్ ఎ) 



పారిస్ (ఫ్రాన్సు)



పోర్చుగల్



రోమ్ (ఇటలి)




స్టాక్ హోం (స్వీడెన్)


స్విట్జెర్లాండ్




వెనిస్ (ఇటలి).



ఆఖరుగా  మన  ముంబై
 
 






Monday 23 May 2011

ఇదేనండి ఇదేనండి మన (అ) భాగ్యనగరం !!!! ఫోటోలు

మన భాగ్యనగరం(హైదరాబాద్) లో ట్రాఫిక్ విన్యాసాలు 

























Wednesday 18 May 2011

తల్లితండ్రులూ తస్మాత్ జాగర్త!!!!!

వాహనాన్ని మైనర్ నడిపితే యజమానిదే బాద్యత - సుప్రీంకోర్టు


మైనర్స్ వాహనాన్ని నడిపి ప్రమాదాన్ని కలిగిస్తే వాహన యజమానే నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. ఈ మేరకు రోడ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ 8 లక్షలు పరిహారాన్ని చెల్లించాలని ట్రైబునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది.  తన వాహనం దుర్వినియోగం కాకుండా చూసుకోవలసిన బాద్యత వాహన యజమానిదే అని సర్వోన్నత న్యాయస్తానం స్పష్టం చేసింది. ఒక మోటార్ సైకిల్ దుర్వినియోగం కాకుండా ఎలాంటి లైసెన్సులేని ఒక మైనార్ నడపకుండా చూడవలసిన బాద్యత యజమానిదే.  అందువల్ల ఆయనే నష్టపరిహారం చెల్లించాలని మోటర్ వాహనాల ప్రమాదాల ట్రైబునల్ తీర్పు ఇవ్వడం సబబే అని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.  - ఈనాడు వార్త


మన హైదరాబాద్ నగరంలో ఆ మాటకొస్తే చాల నగరాల్లో/పట్టనాళ్ళలో చాలామంది మైనర్స్ మోటర్ సైకిల్స్ అడ్డదిడ్డంగా నడుపుతూ ఉంటారు.  తల్లి తండ్రులు ఆ పిల్లలు వాహనాలు ఎలా నడుపుతున్నారో పట్టించుకోరు.  పిల్లల కోరిక తీర్చాలని లేదా పిల్లలు నేర్చుకోవాలని  అన్న ఉద్దేశంతో.  ఇప్పుడు ఈ  తీర్పు చూసిన తరవాతైనా తల్లి తండ్రులు తమ పిల్లలని అదుపులో పెట్టాలి. 

* 18 సం. లు దాటితే కాని వారికి వాహనం ఇవ్వకూడదు. 

* పిల్లలు తప్పనిసరిగా హెల్మేట్ట్స్ పెట్టుకునేటట్టుగా చూడాలి.

* వాహనానికి సంబంధించిన అన్ని పేపర్స్ ఉండేటట్టుగా చూడాలి.  

లేకపోతే పిల్లలు చేసే ప్రమాదాలకి తల్లితండ్రులు నష్టపోయ్యే అవకాశం ఉంది. 

తస్మాత్ జాగర్త.     

Wednesday 4 May 2011

"పాడుతా తియ్యగా" కొత్త అంకం

శ్రీ SP బాలు గారి ఆధ్వర్యంలో "పాడుతా తియ్యగా" కొత్త అంకం E TV లో ప్రారంభం అయ్యింది. 

పిల్లలు చాలా ఉత్సాహంగా పాడారు.  మొదటి భాగం బాగుంది. 

మొదట పాడిన పాప, చివరగా పాడిన పాప మిగిలిన వారందరికంటే బాగా పాడారు.  ఇద్దరికీ మార్కులలో తేడా 10  కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. నిజానికి మొదటగా పాడిన పాప కంటే చివరగా పాడిన పాపకి కొంచం మార్కులు ఎక్కువ వేయొచ్చు అనిపించింది.  చివరగా పాడిన పాప గొంతులో దమ్ము (ఆయాసం) వినిపించలా. చక్కగా పాడింది.  ఆ పాప పాడిన పాటలో ఫీలింగ్ అక్కడక్కడ తప్పింది అనటం కూడా సరికాదేమో.  చిన్నపిల్ల - ఆ గొంతులో మహాగాయని సుశీల పలికిన ఫీలింగ్ ఉండాలనుకోవటం కుదరదేమో.

ఏమైనా మంచి టాలెంట్ ఉన్న పిల్లలు కనిపించారు.  వాళ్ళు మరిన్ని మంచి పాటలు రాబోయే ఎపిసోడ్ లలో వినిపిస్తారని ఆశిద్దాం.