Thursday 30 June 2011

తెలుగు మా(పా)టకు సినిమా తెగులు - శ్రీ పైడిపాల


మన  సినిమాలలో మన మాత్భ భాష తెలుగు ఎంత దౌర్భాగ్య స్థితికి చేరుకుందో, దాని వల్ల యువతరం ఎలా ప్రభావితం అవుతున్నారో తెలియచేస్తూ శ్రీ పైడిపాల ఈ రోజు ఆంధ్రభూమి 'వెన్నెల' లో ఒక మంచి వ్యాసం రాసారు.  దాని లింక్ ఇస్తున్నాను.  తప్పకుండా చదవండి.


Friday 17 June 2011

హాస్యబ్రహ్మ జంధ్యాల







నటుడిగా, నాటక రచయిత గా, సినీ రచయితగా, దర్శకుడిగా అన్ని రకాల సినిమాలు రాసినా, తీసినా హాస్యానికి చిరునామా గా వాసి కెక్కిన ప్రతిభా వంతుడు జంధ్యాల.  


 భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే ప్రసాదించిన వరం నవ్వు అయితే, పండిత పామర భేదం లేకుండా  తెలుగు ప్రేక్షకులకు మనసార నవ్వే యోగం కల్గించిన ఉత్తముడు  జంధ్యాల. 


 హాస్య సినిమాల యుగం జంద్యాలతో ఊపందుకుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.


భగవంతుడు కేవలం మనుషు లకు మాత్రమే ప్రసాదించిన నవ్వును దేవుళ్ళకూ రుచి చూపించాలని ఇతర లోకాలకి జంధ్యాల పయనించి రేపు జూన్ 19 కి దశాబ్దం గడిచి- పోతుంది. 
 
ఆయన మన  మధ్య ఉండగా ఇచ్చిన ఇంటర్వ్యూ హైదరాబాద్ దూరదర్శన్ వారు మళ్లీ మనకోసం రేపు ఆదివారం జూన్ 19 వ తారికున రాత్రి 8 గం.లకు మళ్లీ తిరిగి సోమవారం 20 వ తేది మద్యాహ్నం 1 . 30 గం లకు ప్రసారం చేస్తున్నారు.  

Thursday 16 June 2011

2022 సం. లో "దోహ కతర్" లో ప్రపంచ కప్ ఫుట్ బాల్ కోసం నిర్మిస్తున్న స్టేడియమ్స్ - ఫొటోస్

2022 సం. లో దోహ కతర్ లో జరగబోయే ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అద్బుతంగా స్టేడియంలని నిర్మిస్తున్నారు. వాళ్ళు నిర్మించే కొన్ని స్టేడియంల నమూనాలు

అక్కడ వాతావరణం వేడిగా ఉంటుందని అన్ని స్టేడియమ్స్ ఏ సి చేయిస్తున్నారు.  ఆయిల్ ఉన్న దేశం కదా ఆర్భాటాలు బాగానే ఉంటాయి. "All the Best" చెపుదాము.


Wednesday 15 June 2011

Transperent విమానాలు



Airbus విమాన సంస్ట్ట 2050 సం లో కొత్త విమానాలని తెద్ధామన్నఆలోచనలో ఉంది. ఆ విమానాలలో ప్రయాణించటం నిజంగా మంచి అనుభూతే. కారణం అవి Transperent ఉండే విమానాలు అవ్వడమే. ఆ విమానం ఎలా ఉంటుందో ఈ క్రింద ఫొటోస్ లో చూడండి.




















మన తరంలో ఎంతమంది ఈ విమానాన్ని ఎక్కుతారో తెలియదు గాని ప్రస్తుత, భవిషత్ తరాలు వాళ్ళు మాత్రం గొప్ప అనుభూతిని పొందుతారని ఆశిద్దాం.

కర్టెసీ:  http://www.yahoo.co.in/

Thursday 9 June 2011

"చిత్రం భళారే విచిత్రం" ఆరుగురు కవల అమ్మాయిలు

ఎవరైనా స్త్రీ ఒక కాన్పులో కవలలకి జన్మనిస్తే ఆహ అనుకుంటాం.  ముగ్గురికి జన్మనిస్తే అబ్బురంగా చెప్పుకుంటాం.  నలుగురు దాటితే అందరు బ్రతికి బట్ట కడతారో లేదో అనుకుంటాం.  అలాంటిది ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు పుట్టటం ఆ ఆరుగురు ఆడపిల్లలు కావడం వాళ్ళు అందరు బ్రతికిఉండటం.


1983 సం. లో నవంబర్ 18 వ తారికున యు కే లో నివసిస్తున్న గ్రాహం, జనేట్ అనే దంపతులకు ఒకే కాన్పులో ఆరుగురు ఆడపిల్లలకు కలిగారు.

మొదట పుట్టిన పాపకి హన్నాఅని తరువాత వరుసగా లూసీ, రూత్, సారా, కేథ్, జెన్నీ అని పేర్లుపెట్టారు. ఒక్కొక పిల్ల నాలుగు నిముషాల తేడాతో జన్మించింది. ఒక్కొక్కపిల్ల దాదాపు 2 పౌండ్స్ బరువు ఉన్నారు. ప్రస్తుతం వారి వయస్సు 28 సం. లు.   


Hannah, Ruth, Luci, Kate, Jennie and Sarah


with parents Graham and Janet
 ఆ ఆరుగురు అమ్మాయిల వేరువేరు ఉద్యోగాలలో, వృతుల్లో స్థిరపడ్డారు. ఒకళ్ళు విదేశాలలో ఉంటె ఒకరు తల్లితండ్రుల ఇంటికి దగ్గరగా ఉంటుంది. మిగిలిన నలుగురు అమ్మాయిలూ తల్లితండ్రుల దగ్గరే ఉంటారు. అందరు సంవత్సరంలో కొన్ని సార్లైనా కలుస్తారు.






ఈ ఆడపిల్లలని చూసుకొని ఆ తల్లి తండ్రులు మురిసిపోతుంటారు.

ప్రపంచంలో ఆరుగురు ఆడపిల్లలు ఒకకానుపులో పుట్టి పెరిగి పెద్దైన వాళ్ళు బహుశా వీరేనేమో!

Monday 6 June 2011

ప్రపంచంలోనే పెద్ద తామర ఆకులు

"విక్టోరియా యమజోర్నికా" అని పిలువబడే ఈ తామర ఆకు ప్రపంచంలోనే పెద్ద తామర ఆకు.


రాబర్ట్ స్చోమ్బుర్గ్క్ అనే అన్వేషకుడు అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో 1836 సం. లో కనుగొన్న ఈ తామరాకు చుట్టుకొలత ఎంతో తెలుసా? 3 మీటర్లు. ఈ ఆకు 75 పౌండ్ల వరకు బరువు మోస్తుందిట! అప్పుడు ఇంగ్లాండ్ పరిపాలిస్తున్నవిక్టోరియా మహారాణి గౌరవార్ధం ఈ ఆకులకు విక్టోరియా రేగియా పెట్టటంజరిగింది.


                     














                    

Thursday 2 June 2011

సిని 'మా' వీణ





 తెలుగులో మొట్టమొదటగా ప్రారంభమైన ఛానల్ దూరదర్శన్ హైదరాబాద్.  1995 లో ప్రైవేటు చానల్స్ వచ్చిన 
తరువాత దూరదర్శన్ మెల్లగా వెనుకబడింది.  

ప్రైవేటు చానల్స్ రకరకాల మసాలా కార్యక్రమాలతో వీక్షకులని తమవైపు తిప్పుకున్నాయీ. 

దూరదర్శన్ ఒక గవర్నమెంట్ ఛానల్ అవ్వటంతో కొన్ని పరిమితులకి లోనై పని చేస్తుంది.  ప్రైవేటు చానల్స్ కి అలాంటి పరిమితులు లేవు. దీనితో దూరదర్శన్ పట్ల నగర, పట్టణ ప్రజలకి  ప్రాధాన్యత తగ్గింది.  
దానితో దూరదర్శన్ కొన్ని మంచి కార్యక్రమాలని ప్రజలు మిస్ అవ్వుతున్నారు. 


గత మూడు శనివారాలలో ప్రసారమవుతున్న "సిని'మా'వీణ" అటు వంటి కార్యక్రమమే.   దూరదర్శన్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన విజయ దుర్గ గారు నిర్మాతగా రూపొందించిన ఈ కార్యక్రమం ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షించింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. చాలా రోజుల తరువాత ఒక మంచి కార్యక్రమం చూసాం.   


ఈ మధ్య కాలంలో వినతగ్గ పాటలు సినిమాలలో తగ్గిపోతున్నై.  మన సంస్కృతికి చెందిన కొన్ని వాయిద్యాలు వాడటమే మానేశారు.  తెలుగు సినిమా 
స్వర్ణయుగంగా చెప్పుకునే కాలంలో కొన్ని సినిమాలలో ఆ సిని నిర్మాతల అభిరుచికి అనుగుణంగా వీణ పాటలు ఉండేవి.   ఆ పాటలన్నీ ప్రజాదరణ పొందినవే.  

ఆ వీణ పాటలు ఏ  రాగాలలో  సమకుర్చబడ్డాయి ఆ సంగీత
దర్శకులు ఏ విధంగా కృషి సలిపారు ప్రముఖ వైణిక 
విద్వాంసులు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారు వివరించారు. 

ఒక కొత్త ఆలోచనతో తీసిన ఈ కార్యక్రమం అభినందనీయం.  
చూడాలని ఉంటె శనివారం రాత్రి 8 గం.లకి తిరిగి
సోమవారం ఉదయం 8.30ని. ల కి ఈ కార్యక్రమం చూడవచ్చు. 


ఈకార్యక్రమం రూపొందించిన విజయదుర్గ గారికి,  
దూరదర్శన్  హైదరాబాద్ కేంద్రం వారికి అభినందనలు.