Wednesday 18 May 2011

తల్లితండ్రులూ తస్మాత్ జాగర్త!!!!!

వాహనాన్ని మైనర్ నడిపితే యజమానిదే బాద్యత - సుప్రీంకోర్టు


మైనర్స్ వాహనాన్ని నడిపి ప్రమాదాన్ని కలిగిస్తే వాహన యజమానే నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. ఈ మేరకు రోడ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ 8 లక్షలు పరిహారాన్ని చెల్లించాలని ట్రైబునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది.  తన వాహనం దుర్వినియోగం కాకుండా చూసుకోవలసిన బాద్యత వాహన యజమానిదే అని సర్వోన్నత న్యాయస్తానం స్పష్టం చేసింది. ఒక మోటార్ సైకిల్ దుర్వినియోగం కాకుండా ఎలాంటి లైసెన్సులేని ఒక మైనార్ నడపకుండా చూడవలసిన బాద్యత యజమానిదే.  అందువల్ల ఆయనే నష్టపరిహారం చెల్లించాలని మోటర్ వాహనాల ప్రమాదాల ట్రైబునల్ తీర్పు ఇవ్వడం సబబే అని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.  - ఈనాడు వార్త


మన హైదరాబాద్ నగరంలో ఆ మాటకొస్తే చాల నగరాల్లో/పట్టనాళ్ళలో చాలామంది మైనర్స్ మోటర్ సైకిల్స్ అడ్డదిడ్డంగా నడుపుతూ ఉంటారు.  తల్లి తండ్రులు ఆ పిల్లలు వాహనాలు ఎలా నడుపుతున్నారో పట్టించుకోరు.  పిల్లల కోరిక తీర్చాలని లేదా పిల్లలు నేర్చుకోవాలని  అన్న ఉద్దేశంతో.  ఇప్పుడు ఈ  తీర్పు చూసిన తరవాతైనా తల్లి తండ్రులు తమ పిల్లలని అదుపులో పెట్టాలి. 

* 18 సం. లు దాటితే కాని వారికి వాహనం ఇవ్వకూడదు. 

* పిల్లలు తప్పనిసరిగా హెల్మేట్ట్స్ పెట్టుకునేటట్టుగా చూడాలి.

* వాహనానికి సంబంధించిన అన్ని పేపర్స్ ఉండేటట్టుగా చూడాలి.  

లేకపోతే పిల్లలు చేసే ప్రమాదాలకి తల్లితండ్రులు నష్టపోయ్యే అవకాశం ఉంది. 

తస్మాత్ జాగర్త.     

No comments:

Post a Comment