Monday 11 July 2011

భారత దేశపు నయాగరా


కేరళ రాష్ట్రంలో  అతిపిల్లీ గ్రామం దగ్గరగా ఒక అందమైన జలపాతం ఉంది.  చాలా మందికి ఈ ప్రదేశం గురించి తెలియదు.  నిజం చెప్పాలంటే కేరళలో ఉండే కొంతమందికే తెలుసు అంటే ఆశ్చర్యం వేస్తుంది.  

కోయంబత్తూరు నుంచి కొచ్చిన్ వెళ్ళే దారిలో ఉంది ఈ ప్రదేశం (మాప్ చూడండి).  త్రిచూర్కి రోడ్ ద్వారా 65 కిలో మీటర్ల దూరం లోను కొచ్చిన్ విమానాశ్రయానికి 60  కిలో మీటర్ల దూరం లోను ఉంది. 

వర్షాకాలం వెళ్ళిన తరువాత అంటే సెప్టెంబర్ నెలలో వెళితే మదురానుభూతిని కలుగ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ సమయంలో జలపాత ఉదృతి బావుంటుంది.

మీ కోసం ఆ ప్రదేశానికి సంభందించిన కొన్ని ఫొటోస్ మరియు మాప్ ఇస్తున్నాను.  వచ్చే దసరా సెలవల్లో సరదాగా మన భారతదేశా నయాగరా చూసిరండి.









2 comments:

  1. భారత దేశపు నయగారా చాలా అద్భుతంగా ఉందండి. ఫోటోలు కూడా ప్రత్యక్షంగా చుస్తున్నట్టుగానే ఉన్నాయి. మన దేశం లోఇలా వెలుగులోకి రాని సుందర ప్రదేశాలు ఎన్నెన్నో

    ReplyDelete