Friday 5 August 2011

గాన సరస్వతి "వాణి జయరాం"





శాస్త్రీయ సంగీతపు దన్నుతో, గళలాలిత్యంతో 

పలు భారతీయ భాషలలో అద్బుతగానంతో సినీసంగీత ప్రియులను 

నాలుగు దశాబ్దాలుగా ఉర్రుతలూగిస్తున్న గాన సరస్వతి!

"బోలోరే పపీహర" అంటూ 'గుడ్డి' సినిమాతో హిందీసీమలో అడుగుపెట్టి లత, ఆశాలకే 

దడ పుట్టించిన దక్షిణాది గాయని శిరోమణి!

మాతృభాష కాకపోయినా స్వచమైన ఉచ్చారణతో తెలుగు శ్రోతల హృదయాలను దోచిన శారదా స్వరూపిణి

'శంకరాభరణం' 'స్వాతికిరణం'  తెలుగు సినిమాలలో పాడిన పాటలకు రెండుసార్లు జాతీయగాయని పురస్కారం అందుకొని 'జయ' కేతనాన్ని ఎగరవేసిన మహిళామణి  
                 
                                                  "వాణి జయరాం" 

దూరదర్సన్ సప్తగిరి చానెల్ క్రితం శనివారం రాత్రి 8 గం. ల కు ప్రసారమైన ఆమె కార్యక్రమం అధ్బుతంగా   ఉంది.

గుడ్డి, శంకరాభరణం  లో ఆమె పాడిన పాటల తో కూర్చిన  కార్యక్రమం మొదటి భాగం సమయం తెలియకుండా గడిచి పోయింది.  
   
ఆమె బాల్యం గురించి, సినిమాలలో ప్రవేశం గురించి వాణి జయరాం ఇచ్చిన వివరాలు సరికొత్తగా ఉన్నాయి.

ఇంకా మూడు భాగాలు ప్రసారమవుతాయి.


దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి రా 8 గం. లకు తిరిగి సోమవారం ఉదయం
8 .30 ని. లకు

"పూజలుసేయ పూలు తెచ్చాను" అని పాడిన వాణి జయరాం గురించి శ్రోతలకు దూరదర్సన్ వారు ఏ గీతా కుసుమాలు  తెస్తారో, ఆమె జీవన సౌరభాలను ఎలా పంచుతారో మిగిలిన భాగాలలో చూద్దాం. 

8 comments:

  1. Thanks for the information. I missed it last week. I've come to know about the other episodes through your post. I thought it was a single episode programme.

    madhuri.

    ReplyDelete
  2. If you don't mind I like to suggest you to stick to one or two fields of your interest and write about it in your blog. This will brings new visitors to your blog.

    ReplyDelete
  3. సప్తగిరి లో ఈ కార్యక్రమం చూశాను బాగుంది. ప్రచారం లేదు కానీ సప్తగిరిలో మంచి కార్యక్రమాలు వస్తున్నాయి

    ReplyDelete
  4. నమస్తే దేవిక గారు,

    మీ బ్లాగ్ చాలా చాలా బాగుంది. నాకు నచ్చింది.

    వాని జయరాం గారి ప్రోగ్రాం గురించి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    అన్నటు మీ బ్లాగ్ లో ఉన్న చాలా ఫోటోలు football స్టేడియం, విమానాలు వి చాలా బాగున్నాయి.

    ReplyDelete
  5. Ch. V Rao garu,

    Thanks for your suggestion. You may agree when we start a new blog we have enthusiasm to express various things in the blog. It may take some more time for me to decide what is the best field suitable to express.

    ReplyDelete
  6. బుద్దా మురళి గారికి,

    ధన్యవాదాలు.

    మీ అభిప్రాయంతొ ఏకిభవిస్తున్నాను. దూరదర్శన్ లొ మంచి కార్యక్రమాలు ప్రసారం అవుతున్నా తగినంత ప్రచారం లేదు.

    వాణి జయరాం మీద కార్యక్రమం ఇంకా రెండు వారాలు ప్రసారమవుతుందని తెలిసింది.

    ReplyDelete
  7. వినొద్ కుమార్ గారు

    థాంక్స్

    ReplyDelete