Monday 18 April 2011

ఖరనామ సంవత్సరం అంటే గాడిదనామ సంవత్సరమా?

శ్రీ ఖరనామ సంవత్సరం అంటే గాడిద నామ  సంవత్సరం అని మొన్న ఉగాది రోజున చాలామంది సెలవఇచ్చారు.
ఒక పేపర్ అయితే  గాడిదలని పెట్టి కార్టూన్ కూడా వేసింది.  ఇంకొక పేపర్ ఆదివారం పుస్తకంలో మనకున్న 60 తెలుగు సంవత్సరాలలో జంతువు పేరుమీద వచ్చేది ఇది ఒక్క సంవత్సరమే అనేసింది.  కొంతమంది పండితులు కూడా టీవీ చానల్స్ లో ఇదే విధంగా చెప్పారని వినికిడి.
 
అసలు ఖర నామ సంవత్సరం అంటే అర్ధం ఇదేనా!  
 
నాకు తెలిసినంతవరకు కాదు ... అయినా ఎందుకైనా మంచిదని "శబ్ద రత్నాకరం" చూసాను.  అందులో అర్ధం ఏముందంటే ....
 
                      ఖర అంటే ..... స్త్రీ, ఎండిన పోకచెక్క, వాడిగలది, వేడిగాలది, ఒక తెలుగు సంవత్సరం పేరు అని ఉంది
 
                     ఖరము ....... గాడిద
 
సంస్కృతంలో కూడా ఖర అంటే వాడి, వేడి అని అర్థం ఉంది ఖరః అంటే గాడిద అని ఉంది.
 
మొత్తానికి ఈ ఖర నామ సంవత్సరం జంతువుకి సంబంధించినది కాదు.  వాడిమి,  వేడిమి గల  సంవత్సరంగా  ఉండబోతుంది. 
 
జరుగుతున్న పరిణామాలు కూడా రాబొయ్యే కాలాన్ని సూచిస్తూన్నాయీ అనిపిస్తుంది.  
 

No comments:

Post a Comment