"భానుమతి" ఈ పేరు వినగానే తలంపుకు వచ్చేది 'బహుముఖ ప్రజ్ఞాశాలి". సినీరంగంలో అనేక శాఖలలో విశేష ప్రజ్ఞా పాఠవాలు కలిగిన ఆమె జయంతి (7 సెప్టెంబర్) సందర్భంగా సప్తగిరి దూరదర్శన్ హైదరాబాద్ ఛానల్లో ఈ రోజు (6 వ తారికున) రేపు (7 వ తారికున) రాత్రి 8 గం. ల కు భానుమతి గారితో ఇంతకుముందు విజయదుర్గ గారు చేసిన ఇంటర్వ్యూని ప్రసారం చేస్తుంది. ఆమె నటించిన వివిధ చిత్రాలలో సన్నివేశాలు, పాడిన వైవిధ్యభరితమైన పాటలతో కార్యక్రమం రూపొందించారు.
భానుమతిగారి జయంతి సందర్బంగా ఈ కార్యక్రమం ద్వారా ఆమె జ్ఞాపకాలని మరోసారి నెమరువేసుకుందాం